Share News

Alert in AOB ఏవోబీలో అలర్ట్‌

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:12 AM

Alert in AOB ఏవోబీలో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభ మయ్యాయి. దీంతో ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి. కోరాపుట్‌, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి.

Alert in AOB  ఏవోబీలో అలర్ట్‌

అడవులను జల్లెడ పడుతున్న సాయుధ దళాలు

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఏవోబీలో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభ మయ్యాయి. దీంతో ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి. కోరాపుట్‌, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్‌ కగార్‌తో పెద్దసంఖ్యలో మరణిస్తున్నారు. చర్చలకు వారు పిలిచినా కేంద్రప్రభుత్వం ససేమిరా అంటోంది. ఎన్‌కౌంటరల్లో అగ్రనేతలు మరణిస్తుండడం, మరోవైపు లొంగుబాట్లు, కొద్దిరోజుల కిందట అభయ్‌ లేఖ వారిలో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పార్టీ 21వ వ్యవస్థాపక వారోత్సవాలు మావోయిస్టులకు కీలకంగా మారాయి. అయితే ఈ తరుణంలో ఉనికి కోసం వారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ‘మావోయిస్టుల 21వ వ్యవస్థాపక వారోత్సవాలు సందర్భంగా నిఘా పెంచాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏవోబీలో భద్రత చర్యలు చేపట్టాం. వాహన తనిఖీలు చేస్తున్నాం. ప్రముఖులు ఏజెన్సీలో పర్యటించకుండా ఉంటే మంచిది. రాజకీయ నేతలు ఏజెన్సీలో పర్యటనకు వెళ్లితే ముందస్త సమాచారమందించాలని సూచించాం.’ అని సాలూరు రూరల్‌ సీఐ పి.రామకృష్ణ తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 12:12 AM