Share News

Agency అన్ని రంగాల్లో మన్యం ముందంజలో ఉండాలి

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:04 AM

Agency Area Should Lead in All Sectors అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆశావహ జిల్లాగా నీతి ఆయోగ్‌ ప్రకటించే విధంగా కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు.

 Agency    అన్ని రంగాల్లో  మన్యం ముందంజలో ఉండాలి
అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆశావహ జిల్లాగా నీతి ఆయోగ్‌ ప్రకటించే విధంగా కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. నీతి అయోగ్‌ సూచనలకు అనుగుణంగా జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది ఫ్రంట్‌లైన్‌ కార్మికు లందరూ పనిచేయాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలన్నారు. అనంతరం పలువురు అధికారులను పతకాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

- ఆకాంక్ష హాత్‌తో మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగుపడనుందని కలెక్టర్‌ తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తువుల ప్రదర్శన, విక్రయాల స్టాళ్లను కలెక్టరేట్‌లో ఆయన ప్రారంభించారు. పార్వతీపురం జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా తయారైన ఉత్పతులు, ప్యాకింగ్‌ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందుబాటు ధరల్లో ఈ ఉత్పత్తులను వినియోగదారులు పొందొచ్చని తెలిపారు. ఆ తర్వాత తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ, ఏపీవో ఎ.మురళీధర్‌, డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీఈవో రాజ్‌కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

భాగస్వామ్య విధానంతో అభివృద్ధి సాధ్యం

భాగస్వామ్య విధానంతో సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఆదికర్మయోగి కార్యక్రమం నిర్వహణపై శనివారం ఐటీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 113 గ్రామ సచివాలయాల పరిధిలో 165 గ్రామాలను మొదటి విడతలో ఎంపిక చేశామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ తెలిపారు. పీఎం జన్‌మన్‌ ప్రాజెక్టు అధికారి రిషబ్‌ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:04 AM