అద్దె భవనంలో అగచాట్లు
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:38 PM
రాజాంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అద్దెభవనంలో కొనసాగు తోంది. ప్రస్తుతం ఉన్న భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.
రాజాం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాజాంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అద్దెభవనంలో కొనసాగు తోంది. ప్రస్తుతం ఉన్న భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. వర్షంకురిస్తే కారిపోవడంతో సిబ్బంది రికార్డులను భద్రపరుచుకోవడానికి అగచాట్లకు గురవుతున్నారు. ఎక్కడైనా అద్దెకు భవనం తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా సరైన భవనం దొరక్కపోవడంతో శిఽథిలావస్థకు చేరిన భవనంలోనే నెట్టుకు రావాల్సివస్తోంది. ఇటీవల సర్కిల్ పరిధిలో రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లో మద్యం సంబంధిత కేసులు కూడా పెరిగాయి. దీంతో ప్రస్తుతమున్న భవనంలో విధుల నిర్వహణకు అవస్థలు తప్పడం లేదు. శాశ్వత భవనం నిర్మాణానికి అవసరమైన స్థలం సేకరించేందుకు అధికా రులు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ల అరిగేలా తిరుగుతున్నామని ఎక్సైజ్‌అధికారులు చెబుతున్నారు. ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకొని నూతన భవనం నిర్మాణానికి అవసర మైన స్థలం కేటాయించడంతోపాటు నిధులు కూడా మంజూరు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు కోరుతున్నారు.