Share News

కిలోమీటరు నడిచి.. కాశాయవలస చేరి

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:58 PM

ఎగువ కాశాయవలస గిరిశిఖర గ్రామంలో సాలూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి, స్థానిక లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్‌ హర్షవర్ధన్‌ శనివారం పర్యటించారు. ఇటీవల ఆశా వర్కర్‌ శ్యామల డోలీ మోతతో ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే.

 కిలోమీటరు నడిచి.. కాశాయవలస చేరి
ఎగువ కాశాయవలస గ్రామస్థులతో మాట్లాడుతున్న హర్షవర్ధన్‌ :

సాలూరు రూరల్‌,జూలై 12 (ఆంధ్రజ్యోతి):ఎగువ కాశాయవలస గిరిశిఖర గ్రామంలో సాలూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి, స్థానిక లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్‌ హర్షవర్ధన్‌ శనివారం పర్యటించారు. ఇటీవల ఆశా వర్కర్‌ శ్యామల డోలీ మోతతో ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ సూచన మేరకు ఆయన గ్రామాన్ని పరిశీలించారు. గ్రామానికి చేరుకోవడానికి ఏవోబీలో 26వ నెంబర్‌ జాతీయరహదారిపై రోడ్డవలస వరకు, అక్కడ నుంచి కరడవలసకు వాహనంలో చేరుకున్నారు. కరడవలస నుం చి కిలోమీటరుపైగా ఆయన నడిచి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆశా వర్కర్‌ శ్యామల,గ్రామస్థులతో మాట్లాడారు. తాగునీరు,విద్యుత్‌,వైద్యం,విద్య,రోడ్డు తదితర మౌళిక సదుపాయలపై వారిని అడిగి తెలుసుకున్నారు. వారిచ్చిన సమాధానాలతో నివేదిక రూపొందించి రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీకి నివేదించనున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:58 PM