తాడేపల్లి ప్యాలెస్‌లోనే కల్తీ మద్యం ఫార్ములా
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:22 AM
తాడేపల్లి ప్యాల స్‌లోనే కల్తీ మద్యం ఫార్మలా నడుస్తుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆరోపించారు.
ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి ప్యాల స్‌లోనే కల్తీ మద్యం ఫార్మలా నడుస్తుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆరోపించారు. శుక్రవారం రాజాంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కుట్ర పూరితంగా కల్తీ మద్యం ఫార్మలాను తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేశారన్నారు. గత ఐదేళ్లు సరఫరా చేసిన జే బ్రాండ్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్టు చెన్నై, బెంగుళూరు, అమెరికా ల్యాబ్‌లు స్పష్టం చేశాయన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో జంగారెడ్డిగూ డెంలోనే కల్తీ సారా తాగి 27 మంది ప్రాణాలు పోతే కనీసం పోస్టుమార్టమైనా చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురవాన నారా యణరావు, వంగా వెంకటరావు వల్లూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.