Share News

కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ప్యాలెస్‌లోనే

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:22 AM

కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ప్యాలెస్‌లోనే తయారు చేశారని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు.

కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ప్యాలెస్‌లోనే
మాట్లాడుతున్న జగదీశ్వరి

- ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ప్యాలెస్‌లోనే తయారు చేశారని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు. తమ అవినీతి, అక్రమాలు, పాపాలను ఎదుటవారిపై నెట్టడంలో జగన్‌ అండ్‌ కో పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లూ వైసీపీ లిక్కర్‌ మాఫియా నడిపి రూ.3,500 కోట్లు దోచుకుందన్నారు. ఈ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్‌ కుట్రలకు ప్లాన్‌ చేశారన్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం అంశం అన్నారు. కుట్రపూరితంగానే కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేశారన్నారు. సెప్టెంబరు 2న ఆఫ్రికాకు వెళ్లేందుకు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న జనార్దనరావును 23న జోగి రమేష్‌ ఇంటికి పిలిపించుకున్నారన్నారు. జోగి రమేష్‌ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్క ప్రణాళికలు రచించారన్నారు. గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెలన్నింటినీ జగన్‌ గుప్పిట్లో పెట్టుకొని జే బ్రాండ్లు మా త్రమే తయారు చేశారన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 30వేల మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 12:22 AM