Share News

Admissions పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:30 PM

Admissions in Schools Should Increase జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగ తుల్లో ప్రవేశాలు పెరగాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Admissions  పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగ తుల్లో ప్రవేశాలు పెరగాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 1, 6 తరగతుల్లో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయి. ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి విద్యార్థులు చేరేలా శ్రద్ధ కనబర్చాలి. డిజిటల్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వీఆర్‌వోల సహకారం తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నాం. విద్యారులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు, షూస్‌, నోట్‌బుక్స్‌ తదితర వాటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నెంటర్‌ కేటాయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీఈవో బి.రాజ్‌కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, ఎంఈవోలు, పాఠశాలల హెచ్‌ఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:30 PM