Share News

Adivasi Day ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:41 PM

Adivasi Day Should Be Celebrated Grandly జిల్లావ్యాప్తంగా ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Adivasi Day  ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ

పార్వతీపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాన్ని నిర్వహించాలి. గిరిజన లబ్ధిదారులకు భూమి, ఇళ్ల పట్టాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర ఉపకరణాలు, ఆర్థిక లబ్ధిని చేకూర్చే చెక్కుల పంపిణీ చేయాలి. సాంస్కృతిక, ఆర్చరీ పోటీలను నిర్వహించాలి. శనివారం ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈ విషయాన్ని ముందుగా రైతులకు తెలియజేయాలి.’ అన తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉపకలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు కె.రామచంద్రరావు, ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:41 PM