Share News

ఘనంగా ఆదిభట్ల జయంతి

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:51 PM

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు జయంతి వేడుకలను ఆదిభట్ల ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం కానుకుర్తివారు వీధిలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆదిభట్ల జయంతి

విజయనగరం రూరల్‌/కల్చరల్‌, ఆగస్టు 31(ఆంధ్ర జ్యోతి): హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు జయంతి వేడుకలను ఆదిభట్ల ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం కానుకుర్తివారు వీధిలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర ్భంగా హరికథా భాగవతార్‌లు, కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది నాలుగెస్సల రాజు మాట్లాడారు. ఆదిభట్ల నారాయణదాసు కవి, సంగీతకారుడు, నర్తకుడు, భాషా వేత్త, తత్వవేత్త, అనేక ప్రతిభలు కలిగిన ప్రజ్ఞాశాలని కొనియాడారు. ఈసందర్భంగా ఆదిభట్ల నారాయణ దాసు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించా రు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆనంద నారాయణదాసు, మంజూష, మృదంగ విద్వాంసుడు మండపాక రవి, బీజేపీ నాయకుడు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, ఫ్రెండ్స్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అధ్యక్షుడు దవళ సర్వేశ్వరరావు, జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు బద్రి కూర్మా రావు, స్పార్క్స్‌ ప్రతినిధి పీవీ పద్మనాభంతో పాటు, కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హరికథా భాగవతార్‌లు హరికథా గానం చేశారు.

ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఉన్న ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ మండపాక నాగలక్ష్మితో పాటు సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

Updated Date - Aug 31 , 2025 | 11:51 PM