Share News

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:54 PM

: ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించేం దుకు వారంలో ఒకరోజు మండల స్థాయి ప్రజాదర్బార్‌ నిర్వహించేం దుకు శ్రీకారం చుట్టామనితెలిపారు.

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
బొండపల్లి మండలంలోని కొండకిండాం బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌

బొండపల్లి(గజపతినగరం), నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించేం దుకు వారంలో ఒకరోజు మండల స్థాయి ప్రజాదర్బార్‌ నిర్వహించేం దుకు శ్రీకారం చుట్టామనితెలిపారు.శనివారం గజపతినగరంలోని నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. బొండపల్లి, గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ, జామి మండలాలకు చెందిన 14 మంది సీఎం సహాయనిధికి సంబందించి రూ.14 లక్షల 7వేల 297లు చెక్కులను అందజేశారు. అనంతరం 55 మంది నుంచి అర్జీలు స్వీక రించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు పీవీవీ గోపాల రాజు, కోరాడ కృష్ణ, బొండపల్లి, గజపతినగరం, గంట్యాడ, దత్తిరాజేరు మండలాల టీడీపీ అధ్యక్షులు రాపాక అచ్చెంనాయుడు,గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కరనాయుడు, చప్పాచంద్రశేఖర్‌, మక్కువ శ్రీధర్‌, ముం జేటి పార్వతి పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:54 PM