సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:17 AM
: సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు.ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం మండలంలోని ఇరిడి గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు.ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం మండలంలోని ఇరిడి గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇరిడి గ్రామంతో పాటు చుట్టుపక్కల నుంచి పలువురు సమ స్యలపై వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా పలు సమస్యలపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరించారు. అలాగే లోవముఠా ప్రాంతం నుంచి గుమ్మలక్ష్మీపురానికి బస్సు సౌకర్యం కల్పించాలని బీజేపీ మండలాధ్యక్షుడు కడ్రక అప్పలస్వామి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతిపత్రం అందించారు.