శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:59 PM
శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
రామభద్రపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే గంజాయి నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న గంజాయి నిల్వల పరిమాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ కోటిరెడ్డి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.