పారిశుధ్య నిర్వహణపె ౖ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:17 AM
పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగభూషణరావు హెచ్చరించారు. గురువారం మండలంలోని పెద్దూరు, గరుగుబిల్లి పంచాయతీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మురుగునీరు నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, సేకరించిన వ్యర్థాలను చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని కోరారు.
గరుగుబిల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగభూషణరావు హెచ్చరించారు. గురువారం మండలంలోని పెద్దూరు, గరుగుబిల్లి పంచాయతీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మురుగునీరు నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, సేకరించిన వ్యర్థాలను చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని కోరారు. సచివాలయాల పరిధిలోని సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి సక్ర మంగా విధులు నిర్వహించాలని తెలిపా రు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు, కార్యదర్శి బి.అప్పారావు ఉన్నారు.