Share News

అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:35 AM

జిల్లాలోని అనుమతి లేకుండా బాణసంచాను విక్రయించినా, తయారు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలని సూ చించారు.

అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు
వీసీలో పాల్గొన్న కలెక్టరు రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అనుమతి లేకుండా బాణసంచాను విక్రయించినా, తయారు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలని సూ చించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న బాణసంచా విక్రయాలు,తయారీపై పోలీసు అగ్నిమాపక, రెవె న్యూ ఆఽధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మూడు డివిజన్లలో ముగ్గురు తయా రీదారులు ఉన్నారని, 15 మంది హోల్‌ సేల్‌ విక్రయదారులు ఉన్నారని డీఆర్వో శ్రీని వాస్‌ మూర్తి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాణసంచాను ఏ స్థాయిలో విక్రయించినా అనుమతి తప్పనిసరిఅని చెప్పారు. హోల్‌సేల్‌ షాపులు, పోలీస్‌,పైర్‌,రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాలన్నారు. గ్రామాల్లో జరిపే విక్రయాలను వీఆర్వోలు తనిఖీ చేయాలని ఆదేశించారు.అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలని, నీరు అం దుబాటులో ఉంచాలని, పైర్‌ సిండర్లు ఏర్పాటుచేయాలని సూచించారు. సమా వేశంలోని జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్‌, డీఎస్పీ వీర్‌కుమార్‌ పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి కృషిచేయాలి

సీజన్‌లు వ్యాధులు, మందులు పంపిణీ, ఆసుపత్రిల్లో పరిశుభ్రత, ఆసుపత్రిల్లో రోగా నిర్ధారణ సేవలు, దేవాలయాలు మౌలిక సదుపాయాలు ప్రధాన మంత్రి తదితర ఆంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ గురువారం రాత్రి కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలోని జిల్లాను అభివృద్ధిలో మొదటి ఐదు స్థానాలలో ఉండే విధంగా కృషి చేయాలని కోరారు.

Updated Date - Oct 10 , 2025 | 12:35 AM