Share News

ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:39 PM

ఎరువులను కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, మండలప్రత్యేకాధికారి ఎం.అన్నపూర్ణ హెచ్చరించారు.

ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
చీపురుపల్లి:దుకాణంలో పరిశీలిస్తున్న అధికారులు:

కొత్తవలస, జూలై 30(ఆంధ్రజ్యోతి) : ఎరువులను కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, మండలప్రత్యేకాధికారి ఎం.అన్నపూర్ణ హెచ్చరించారు. బుధవారం మండలంలో కంటకాపల్లి తదితర గ్రామాల్లో ఎరువులు విక్రయిస్తున్న షాపులు, నిల్వఉంచే గొడౌన్‌లను ఏవో రాంప్రసాద్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు ఎంత అమ్మకాలను చేశారన్న విషయాన్ని స్టాక్‌ రికార్డులో నమోదు చేయాలని కోరారు.

ఫచీపురుపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి):పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో తహసీల్దారు డి.ధర్మరాజు, ఏవో సూర్యకుమారి తదితరులు తనిఖీ చేశారు. రికా ర్డులు పరిశీలించారు.

Updated Date - Jul 30 , 2025 | 11:39 PM