ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:54 PM
ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు.
- కృత్రిమ కొరత సృష్టించినా కూడా..
- హెచ్చరించిన విజిలెన్స్ అధికారులు
- జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల తనిఖీ
పాలకొండ/భామిని/వీరఘట్టం/సీతంపేటరూరల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండల్లాలోని వివిధ ఎరువుల షాపులను తనిఖీ చేశారు. స్టాక్ రిజిష్టర్లు, నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే షాప్‌లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. విజిలెన్స్ సీఐ పి.రమణయ్య పాలకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు రత్నకుమారి, రాజాం వెల్ఫేర్ అధికారి చంద్రశేఖర్, వ్యవసాయాధికారులు తిలక్, రవీంద్ర, జె.సౌజన్య, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.