Share News

పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:04 AM

పంచాయతీల పరిధిలో పరిసరాలు పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు హెచ్చరించారు.

పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
గొట్టివలసలో చెత్త తొలగింపుపై ఆదేశిస్తున్న డీపీవో కొండలరావు

- జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు

గరుగుబిల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల పరిధిలో పరిసరాలు పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు హెచ్చరించారు. గురువారం గొట్టివలస, మరుపెంట, ఉల్లిభద్ర పంచాయతీల్లో పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల పరిధిలో తడి, పొడి చెత్తలను వేరు చేసి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. కేంద్రాల పరిధిలో వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారీకి దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండాలని, దుకాణాల్లో విక్రయిస్తే అపరాధ రుసుం తప్పదని హెచ్చరించారు. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి, నిషేధంపై వారికి అవగాహన కల్పించాలని కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో ఎల్‌.గోపాలరావు, కార్యదర్శులు పి.శిరీష, ఎం.భార్గవనాయుడు, ఎస్‌.శ్రీనివాసరావులు ఉన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:04 AM