అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:54 PM
అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం లో ప్రణాళిక కార్యదర్శులతో సమీక్షించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ దరఖా స్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవా లని కోరారు.
విజయనగరం టౌన్, నవంబరు19 (ఆంధజ్ర్యోతి): అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం లో ప్రణాళిక కార్యదర్శులతో సమీక్షించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ దరఖా స్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవా లని కోరారు.
విధులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదు
సచివాలయ ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని కమిషనర్ పి.నల్లనయ్య హెచ్చరించా రు. విజయనగరం నగరపాలకసంస్థలోని 1, 2, 4 సచి వాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా తొలుత సచివాలయంలోని హాజరుపట్టిని, ప్రజా ఫిర్యాదులు పరిష్కార విధానాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి, నీటిపన్ను వసూళ్లలో వెనుక బడి ఉండడంపై మండిపడ్డారు.
ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి
రాజాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇంటి పన్నులు, కొళాయిలు బిల్లులు సకాలంలో చెల్లించాలని మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రరావు సూచించారు. బుధవారం మునిసిపాలిటీలోని వస్త్రపురికాలనీ, ఆదర్శనగర్ కాలనీలో వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటి పన్నులు, కొళాయి బిల్లుల వసూళ్లను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఇప్పటివరకూ మునిసిపాలిటీ పరిధిలోని రూ.3.50 కోట్లు ఇంటి పన్నులు వసూల్లు చేయవాల్సి ఉండగా ఇంతవరకు రూ 1.50 కోట్లు వసూలుచేసినట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, మునిసిపాలిటీ రెవెన్యూ అధికారులు సమన్వయం తో మార్చి నాటికి వసూలులక్ష్యం పూర్తిచేయాలని నిర్ణయించామని, చెప్పారు. కొళాయి బిల్లులు ఐదేళ్ల నుంచి రూ.రెండు కోట్లు వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంతవరకు 10 శాతం కూడా పూర్తిచేయలేదని చెప్పారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లక్ష్యం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.