Share News

ITDA PO: పార్కు అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - May 24 , 2025 | 12:15 AM

ITDA PO: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని సుంకి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ పార్కు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ అధికారులను ఆదేశించారు.

ITDA PO: పార్కు అభివృద్ధికి చర్యలు
అధికారులకు సూచనలిస్తున్న పీవో

- ఐటీడీఏ పీవో అశుతోష్‌

గరుగుబిల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని సుంకి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ పార్కు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఈ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్షించే విధంగా పార్కును సుందరీకరించాలని సూచించారు. పార్కుకు ఆనుకుని ఉన్న షాపుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే తోటపల్లి ప్రాజెక్టు ప్రాంతంలో బోటు షికారును ప్రారంభించేందుకు దృష్టి సారించాలన్నారు. నదీ ప్రాంతంలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి బోటు షికారుకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఐటీడీఏ ఏఈ జి.తిరుపతిరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:15 AM