Share News

Medical Services వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:05 PM

Actions Against Negligence in Medical Services ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగులకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు హెచ్చ రించారు. శనివారం గరుగుబిల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు.

 Medical Services  వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
గిరిజన గర్భిణుల వసతిగృహంలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగులకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు హెచ్చ రించారు. శనివారం గరుగుబిల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారిని ప్రాణా పాయం నుంచి బయటపడేలా చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలు, విద్యుత్‌ ఉపకరణాలను దూరంగా ఉంచాలని తెలిపారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రం ప్రాంగణాన్ని సిబ్బందితో కలిసి శుభ్రపర్చారు. పలు రకాల మొక్కలను నాటారు. స్వచ్ఛ ఆంధ్ర నోడల్‌ అధికారి టి.జగన్మోహనరావు మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల ప్రభావంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని 37 పీహెచ్‌సీలు, ఐదు అర్బన్‌ పీహెచ్‌సీల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు ఎస్‌.సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో జి.పైడితల్లి, ఈవోపీఆర్‌డీ ఎల్‌.గోపాలరావు, డెమో యోగేశ్వరరెడ్డి, ఎపిడిమిక్‌ ఈవో సత్తిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గర్భిణుల వసతిగృహం పరిశీలన

సాలూరు: పట్టణంలోని గిరిజన గర్భిణుల వసతిగృహాన్ని డీఎంహెచ్‌వో భాస్కరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. గర్భిణులకు అందుతున్న వైద్యం, ఆహారం తదితర వాటిపై ఆరా తీశారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గర్భిణులకు ఆరోగ్య సమస్యలేమైనా ఉంటే ప్రాంతీయ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ప్రోగ్రాం అధికారి రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:05 PM