నిర్లక్ష్యం వ్యవహరిస్తే సిబ్బందిపై చర్యలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:23 AM
రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజ యచంద్ర హెచ్చరించారు. గురువారం పార్వతీపురంలోని జిల్లా కేంద్రాసుపత్రిని పరిశీలించారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజ యచంద్ర హెచ్చరించారు. గురువారం పార్వతీపురంలోని జిల్లా కేంద్రాసుపత్రిని పరిశీలించారు. తొలుత రోగులకు అందుతున్న వైద్య సేవలకు సంబంధిచి వారి బంధువుల ను అడిగి తెలుసుకున్నారు. రోగులను లిఫ్ట్‌పై సక్రమంగా తీసుకువెళ్లడం లేదని, మెట్లపై నుంచి తీసుకువెళ్లాల్సివ స్తోందని బంధువులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత ఎలక్ర్టీషియన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయాలని అధికారులను కోరారు. త్వరలో అన్ని వసతులు కలిగిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి అందుబా టులోకి రానుందని చెప్పారు.అనంతరం విజయచంద్ర విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యసేవలతో పాటు ప్రత్యేక చికిత్సలు, సర్జరీలుచేయడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అం దించనున్నట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రి నుంచి విజయనగరం, విశాఖలోని ఆసుపత్రులకు రిఫరల్ చేయకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు, చికిత్సలు జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభంకానున్న మల్జీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుతాయని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగశివజ్యోతి ఉన్నారు.
ఫ పార్వతీపురం రూరల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం విద్యకోసం ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజ యచంద్ర తెలిపారు. గురువారం మండలంలోని కవిటిభద్ర కేజీబీవీ జూనియర్‌కళాశాలలో 2.12 కోట్లతో నిర్మించనున్న అదనపు వసతుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పాఠశా లలో విద్యార్థినులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరానికి హామీనిచ్చారు.