పార్వతీపురం తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 18 , 2025 | 12:10 AM
పార్వతీపు రం తహసీల్దార్ జయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.
పార్వతీపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): పార్వతీపు రం తహసీల్దార్ జయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విజయచంద్రపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్థానిక తహసీ ల్దార్ కార్యాలయం వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు ములగ రైతుల వద్ద ఆమె రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారని, అందులో రూ.2లక్షలు రైతులు ఇచ్చారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓబీసీ తదితర ధ్రువీకరణ పత్రాలను సకాలంలో ఇవ్వకుం డా తహసీల్దార్ ఇబ్బందలు పెడుతున్నారని మరికొం తమంది టీడీపీ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అక్కడికి చేరుకుని, ఆందోళనకా రులతో చర్చించారు. టీడీపీ నాయకులు ఆయనకు సమస్యను వివరించారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిం చి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసు కుంటామని తెలిపారు. అవినీతి ఆరోపణలపై దర్యా ప్తు నిర్వహించి నివేదికను కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు అందిస్తామని చెప్పారు.