Without Progress ప్రగతి లేకుంటే చర్యలు తప్పవ్
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:14 PM
Action is Inevitable Without Progress జిల్లాలో పీఎం జన్‌మన్, ఇతర పథకాల కింద మంజూ రైన గృహ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. వారంలోగా ప్రగతి కనిపించకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్వతీపురం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం జన్‌మన్, ఇతర పథకాల కింద మంజూ రైన గృహ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. వారంలోగా ప్రగతి కనిపించకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అధికారు లందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెలలో 300 పైగా సూర్యఘర్ యూనిట్లు స్థాపించాలని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, ఎల్‌డీఎం ఎన్.విజయ స్వరూప్, తదితరులు పాల్గొన్నారు.