Sand ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:10 PM
Action Against Illegal Sand Transportation ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ వైశాలి హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజామున కూనేరు రామభద్రపురం, కొమరాడ, గమడ, కళ్లికోట ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఆమె పరిశీలించారు.
తెల్లవారుజామున రీచ్‌ల పరిశీలన
కొమరాడ, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ వైశాలి హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజామున కూనేరు రామభద్రపురం, కొమరాడ, గమడ, కళ్లికోట ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఆమె పరిశీలించారు. కొమరాడ, గుమడలో రీచ్‌కు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. నిబంధనల ప్రకారం యంత్రాలతో తవ్వి , పెద్ద వాహనాలతో ఇసుకను తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఆమె వెంట కొమరాడ తహసీల్దార్ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
గ్రావెల్ తరలిస్తున్న లారీలు సీజ్
పాలకొండ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): అట్టగి గ్రామం వద్ద గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయన తనిఖీలు చేపట్టారు. అనంతరం అంపిలి, గొట్టమంగళాపురం, గోపాలపురం, చిన్నమంగళాపురం ఇసుక రీచ్‌లను పరిశీలించారు. అంపిలి నుంచి వందలాదిగా తరులుతున్న టైర్ బళ్లను ఆపి.. ఇసుక తరలింపుపై ఆరా తీశారు. స్థానికంగా భవన నిర్మాణాలకు మాత్రమే వినియోగించాలని అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో సీఐ ప్రసాద రావు, పాలకొండ, వీరఘట్టం తహసీల్దార్లు రాధాకృష్ణమూర్తి, సాయికామేశ్వరరావు తదిత రులున్నారు.