Share News

Storm Damage తుఫాన్‌ నష్టాన్ని గుర్తిస్తున్నాం

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:57 PM

Acknowledging the Storm Damage పాలకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టాన్ని గుర్తిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌ తెలిపారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించారు.

  Storm Damage  తుఫాన్‌ నష్టాన్ని గుర్తిస్తున్నాం
సబ్‌ కలెక్టర్‌ను సత్కరిస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, గిరిజన సంఘాల నాయకులు

గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పాలకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టాన్ని గుర్తిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌ తెలిపారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ.. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, రహదారుల వివరాలను తహసీల్దార్ల ద్వారా సేకరిస్తున్నామన్నారు. వాటిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ను కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, వివిధ సంఘాల గిరిజన నాయకులు దుశ్శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గుమ్మలక్ష్మీపురంలో గిరిజన భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. అనంతరం ఆయన తిక్కబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. గతంలో పాముకాటుకు గురై కోలుకున్న గిరిజన విద్యార్థితో మాట్లాడారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

Updated Date - Aug 19 , 2025 | 11:57 PM