Share News

Surya Ghar సూర్యఘర్‌ లక్ష్యాలు సాధించాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:00 PM

Achieve Surya Ghar Targets జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పథకం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, విద్యుత్‌శాఖాధికారులతో సమీక్షించారు. సూర్యఘర్‌, పీఎం జుగా, పారిశుధ్య నిర్వహణపై చర్చిం చారు. సూర్యఘర్‌ కోసం దరఖాస్తులు వస్తున్నా.. ఆ దిశగా యూనిట్ల స్థాపన జరగడం లేదని కలెక్టర్‌ తెలిపారు.

 Surya Ghar    సూర్యఘర్‌ లక్ష్యాలు సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పథకం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, విద్యుత్‌శాఖాధికారులతో సమీక్షించారు. సూర్యఘర్‌, పీఎం జుగా, పారిశుధ్య నిర్వహణపై చర్చిం చారు. సూర్యఘర్‌ కోసం దరఖాస్తులు వస్తున్నా.. ఆ దిశగా యూనిట్ల స్థాపన జరగడం లేదని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెలాఖరులోగా వెయ్యి యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారుడు చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా పొందొచ్చని చెప్పారు. స్ర్తీనిధి నుంచి కూడా రుణాన్ని పొందే సౌలభ్యం ఉందన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడమే కాకుండా అదే రోజు ఉదయం ఏడు గంటల్లోగా మొబైల్‌ యాప్‌లో పారిశుధ్య వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:00 PM