Share News

శతశాతం ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:13 AM

బోధనలో మరింత మెరుగుదల తీసుకురావడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, శతశాతం ఫలితాలు సాధించాలని సమగ్రశిక్ష అదనపు పథక సంచాలకుడు డాక్టర్‌ ఎ. రామారావు కోరారు.

 శతశాతం ఫలితాలు సాధించాలి
మాట్లాడుతున్న రామారావు :

బాడంగి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బోధనలో మరింత మెరుగుదల తీసుకురావడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, శతశాతం ఫలితాలు సాధించాలని సమగ్రశిక్ష అదనపు పథక సంచాలకుడు డాక్టర్‌ ఎ. రామారావు కోరారు. శుక్రవారం బాడంగి జడ్పీ ఉన్నత పాఠశాలను, అనుబంధంగా నడుస్తున్న టైప్‌-4 కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థుల పఠన, రాత, గణిత సామర్థ్యం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధానాన్ని పరిశీలించి అభ్యసనాస్థాయిని అంచనా వేశారు. ఈ సందర్భం గా విద్యార్థులతోమాట్లాడి చదువులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకు న్నారు. పరీక్షలకు సన్నద్ధత, రోజువారీ అధ్యయన పద్ధతులు, పునశ్చరణపై, వందరోజుల ప్లాన్‌పై సూచనలు చేశారు.భవిత కేంద్రాన్ని పరిశీలించి దివ్యాంగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:13 AM