Percentage శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:23 AM
Achieve 100% Pass Percentage రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని, శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు ఆదేశించారు. పాలకొండలోని బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.
పాలకొండ, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని, శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు ఆదేశించారు. పాలకొండలోని బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. యూనిట్ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో జరిగిన మార్పులను గుర్తించి విద్యార్థులకు తెలియజేయమని ప్రిన్సిపాల్ హరగోపాల్‌కు సూచించారు. ప్రతి విద్యార్థి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. కళాశాలల్లో పరిసరాల పరిశుభ్రత , విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కళాశాల అడ్మిషన్ రిజిస్ట్టర్లను తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తప్పనిసరిగా మెనూ పాటించాలని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట ఎన్‌ఎస్‌ఎస్ పీవో అప్పారావు, అధ్యాపకులు ఉన్నారు.
ప్రాక్టికల్స్ నిర్వహణకు చర్యలు
సీతంపేట రూరల్: సీతంపేటలోని హైస్కూల్ ప్లస్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈఏడాది ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేలా డీఐఈవో నాగేశ్వరరావు చర్యలు తీసుకున్నారు. బుధవారం ఆ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యపై స్పందించారు. ఈ ఏడాది ప్రాక్టికల్స్ నిర్వహణకు గాను స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌తో చర్చించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని డీఐఈవో హామీ ఇచ్చారు.