పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:39 AM
నగరంలోని కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి సోమవారం తీర్పు వెల్లడించినట్టు మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపా రు.
విజయనగరం క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి సోమవారం తీర్పు వెల్లడించినట్టు మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపా రు. కొత్తపేటకు చెందిన లక్ష్మణరావు 2023లో ఓ బాలిక వెంట పడుతూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదయ్యింది. లక్ష్మణరావుపై నేరం రుజువు కావడంతో న్యాయాధికారి కె.నాగమణి పైవిధంగా తీర్పు వెల్లడించారని డీఎస్పీ తెలిపారు.