గంజాయి కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:18 AM
నగరంలోని ఒకటవ నగర పోలీస్‌స్టేషన్‌లో 2022లో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన ఆకాష్ ఖూడా(22)కి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, లక్ష జరిమానాని విధిస్తూ, విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి శుక్రవా రం తీర్పు వెల్లడించినారు.
విజయనగరం క్రైం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఒకటవ నగర పోలీస్‌స్టేషన్‌లో 2022లో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన ఆకాష్ ఖూడా(22)కి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష, లక్ష జరిమానాని విధిస్తూ, విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి శుక్రవా రం తీర్పు వెల్లడించినారు. నగరంలోని రైల్వేస్టేషన్ పరిధిలో సెప్టెంబరు 19, 2022లో ఒక లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగులతో ఉండడాన్ని గమ నించి, పోలీసులు వారిని విచారించారు. ఆ బ్యాగులో ఉన్న 4.5 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసులో తీర్పు వెలువడింది.