Share News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:26 AM

గుర్ల పోలీసుస్టేషన్‌లో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెంది న గుడిసె సూర్యనారాయణ ఆలియాస్‌ సూర్యకు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధి కారి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 3వేలు జరిమానా విధిస్తూ సోమ వారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

విజయనగరం క్రైం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గుర్ల పోలీసుస్టేషన్‌లో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెంది న గుడిసె సూర్యనారాయణ ఆలియాస్‌ సూర్యకు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధి కారి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 3వేలు జరిమానా విధిస్తూ సోమ వారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల మండలంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలిక చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇల్లు విడిచివెళ్లిపోయినట్టు తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై గుర్ల పోలీసులు అప్పట్లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక అచూకీ లభ్యం అయ్యింది. విచారణలో తనను సూర్యనారాయణ ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె తెలిపింది. దీం తో అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు పోక్సో కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మహిళా పీఎస్‌ డీఎస్పీ తదుపరి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి, అభియోగ పత్రం దాఖ లు చేశారు. దీంతో సూర్యనారాయణపై నేరం రుజువు కావడంతో జైలు శిక్షతో పాటు బాధితురాలికి రూ.2లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నింది తుడికి శిక్ష పడే విధంగా పనిచేసిన పోలీసులను ఆయన అభినందించారు.

Updated Date - Aug 12 , 2025 | 12:26 AM