పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:27 AM
పది చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న తామడ సంతోష్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ గోవిందరావు తెలిపారు.
10 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం
బెలగాం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పది చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న తామడ సంతోష్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ గోవిందరావు తెలిపారు. మంగళవారం పార్వతీపురంలో సీఐ గోవిందరావు విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మేరకు.. జియ్యమ్మవలస మండలంలోని బట్లభద్ర గ్రామానికి చెందిన సంతోష్ బలిజిపేట మండలంలోని సంతతోట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుం డడంతో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లతో పాటు కురుపాం పోలీస్ స్టేషన్‌లోని పది కేసుల్లో ముద్దాయిగా గుర్తించారు. బొబ్బిలిలో ద్విచక్ర వాహన చోదకుడికి లిఫ్ట్ అడిగి మధ్యలో మద్యం తాగించి ద్విచక్ర వాహనం దొంగిలించాడు. సంతోష్ నుంచి పది తులాలు బంగారం, రూ.13 వేలు నగదు, ద్విచక్ర వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌కు గతంలో నేర చరిత్ర ఉంది. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ సీఐ, ఎస్‌ఐలు అప్పారావుకు, సూర్యారావు, ఎస్‌ఐలు సింహాచలం, నీలకంఠం, సంతోషి కుమారి, రాజేష్, సీసీఎస్ హెచ్‌సీ నారాయణ, పీసీ ఉదయ్‌లను అభినందించారు.