హత్య కేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:54 PM
దేవర శిర్లాం పంచాయతీ లోవరకండిలో జరిగిన హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు.
మక్కువ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): దేవర శిర్లాం పంచాయతీ లోవరకండిలో జరిగిన హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ఎం.వెంకట రమణమూర్తి, పోలీస్ సిబ్బందితో కలిసి సాలూరు సీఐ పి.రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మేరకు.. లోవరకండికి చెందిన సాగరపు శివందొర అలియాస్ అది పెయింటింగ్ వర్క్‌లు చేస్తుంటాడు. ఆయనకు భార్య హేమలతతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే గ్రామంలో ఉంటున్న సాగరపు దాళందొర భార్య దమయంతికి ఇద్దరు కుమారులు వెంకటరమణ, కార్తీక్ ఉన్నారు. శివమ్‌దొరకు మొక్కలు, బీరకాయ పాదులు పెంచుతున్నాడు. అందులోకి నాలుగు రోజుల నుంచి ఆవులు వెళ్తున్నా యని రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 28న దమ యంతి మేనళ్లుడు కిషోర్, మహేష్ పార్వతీపురం మండలంలోని జగన్నాథ పురం నుంచి లోవరకండికి వినాయక చవితి ఉత్సవాలకు వచ్చారు. వాలీబాల్ ఆడడానికి వెళ్లడంతో శివందొర అక్కడకు వెళ్లాడు. తనతో వాలీబాల్ ఆడుకుంటే అందర్నీ చక్కెరగుత్తితో పొడుస్తానని బెదిరించాడు. ఆ సమయంలో పెనుగు లాటలో శివందొరకు స్వల్పగాయం కావడంతో భార్య హేమలత వీధివాసులను తిట్టడంతో తగాదా ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న శివందొర దమయం తి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశాడు. గొడవను ఆపే క్రమంలో కార్తీక్‌ను చక్కర గుత్తితో పొడిచాడు. దీంతో కార్తీక్‌కు బలమైన గాయాలయ్యాయి. వెంటనే పార్వ తీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ముద్దాయిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.