Re-survey పక్కాగా భూముల రీసర్వే
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:19 AM
Accurate Land Re-survey రెవెన్యూ గ్రామాల్లో మూడో విడత రీసర్వేను పక్కాగా చేపట్టాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రత్యేకాధికారి (డిప్యూటీ డైరెక్టర్, మంగళగిరి) టి.శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. గురువారం తోటపల్లిలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను తనిఖీ చేశారు.
గరుగుబిల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ గ్రామాల్లో మూడో విడత రీసర్వేను పక్కాగా చేపట్టాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రత్యేకాధికారి (డిప్యూటీ డైరెక్టర్, మంగళగిరి) టి.శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. గురువారం తోటపల్లిలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోపాలు లేకుండా భూముల రీ సర్వే చేపట్టాలన్నారు. గతంలో నెలకొన్న తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పలు గ్రామాల పరిధిలోని రీసర్వే, క్షేత్రస్థాయిలో సిబ్బంది తీరుపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. సర్వేకు ముందు గ్రామస్థాయిలో దండోరా వేయించి సంబంధిత రైతులకు సమాచారం అందించాలన్నారు. వారి సమక్షంలోనే ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. నెంబర్ల వారీగా సర్వే నిర్వహించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, ఆ విషయాలను రైతులకు పూర్తిస్థాయిలో వివరించాలని సూచించారు.
- సీతంపేట రూరల్: గజిలి గ్రామ సమీపంలో చేపడుతున్న భూ రీసర్వేను కూడా ఆయన పరిశీలించారు. భూముల కొలతలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భూ తగాదాలు తలెత్తకుండా గ్రామాల్లో ఉన్న రైతులకు సభలు నిర్వహించి సర్వే సక్రమంగా పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఏడీ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.