Information కచ్చితమైన సమాచారం ఇవ్వాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:36 PM
Accurate Information Must Be Provided పోలీస్ శాఖలో కీలకమైన స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఇవ్వాలి ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో చేపట్టాల్సిన పనులపై సూచనలిచ్చారు.
బెలగాం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో కీలకమైన స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఇవ్వాలి ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో చేపట్టాల్సిన పనులపై సూచనలిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో క్రియాశీలకంగా వ్యవహ రించే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు. రోజు జరిగే విషయాలను భద్రపరుచుకోవాలని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, రాజకీయ వివాదాలు, ప్రముఖ వ్యక్తుల రాకపోకల సమాచారం, ధర్నాలు, భూ తగాదాలు, మత సంబంధమైన గ్రూపుల గురించి ముందస్తుగా తెలుసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అనం తరం విఽధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రంగనాథం తదితరులు పాల్గొన్నారు.