Share News

ప్రమాదవశాత్తు మేడపై నుంచి పడి..

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:15 AM

పట్టణంలోని 25వ వార్డు పీఎన్‌ బొడ్డవలసకు చెందిన దివ్యాంగుడు బండి మనోజ్‌కుమార్‌ (25) ప్రమాదవశాత్తు శుక్రవారం ఉదయం మేడపై నుంచి జారిపడి మృతిచెందాడు.

ప్రమాదవశాత్తు మేడపై నుంచి పడి..

సాలూరు, ఆగస్టు 1 (ఆంరఽధజ్యోతి): పట్టణంలోని 25వ వార్డు పీఎన్‌ బొడ్డవలసకు చెందిన దివ్యాంగుడు బండి మనోజ్‌కుమార్‌ (25) ప్రమాదవశాత్తు శుక్రవారం ఉదయం మేడపై నుంచి జారిపడి మృతిచెందాడు. బండి నరసింహు లు, బండి దమయంతిలకు కుమారుడు మనోజ్‌ పుట్టకతోనే దివ్యాంగుడు. ఇంట ర్‌ వరకు చదువుకున్నాడు. ప్రైవేట్‌ షాపులో పనిచేశాడు. అయితే కొంతకాలం గా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కుటుంబ సభ్యులు, మిత్రులతో చాలా ఆనందంగానే గడిపాడు. అనంత రం 10 గంటల సమయంలో అమ్మ దమయంతి మేడపై ఆరబెట్టిన ఒడియాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మని చెప్పడంతో మేడపైకి ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ అనీల్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 02 , 2025 | 01:15 AM