Share News

రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయండి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:01 AM

పేరుకుపోయిన రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి మునిసిపాలిటీ రీజనల్‌జాయింట్‌ డైరెక్టర్‌, విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్య కోరారు. బుధవా రం విజయనగరంలో రీజయన్‌ పరిధిలో ఉన్న అన్ని మునిసిపాలిటీల రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయండి
:పన్నులు వసూళ్లపైసిబ్బందితో మాట్లాడుతున్న నల్లనయ్య

విజయనగరం టౌన్‌, నవంబరు12(ఆంధ్రజ్యోతి): పేరుకుపోయిన రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి మునిసిపాలిటీ రీజనల్‌జాయింట్‌ డైరెక్టర్‌, విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్య కోరారు. బుధవా రం విజయనగరంలో రీజయన్‌ పరిధిలో ఉన్న అన్ని మునిసిపాలిటీల రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీల వసూళ్లు వేగవంతం చేయాలని కోరారు. పన్ను పరిధిలోకి రాని ఆస్తి వివరాలను నమోదు చేసి పన్ను విఽధించేందుకు చర్యలను చేపట్టాలని కోరారు. పేరమిత్ర యాప్‌ ద్వారా కార్పొరేషన్‌ సేవలను పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సహాయకమిషనర్‌ అప్పలరాజు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలి

అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను ఇబ్బందిపెట్టే యోచన లేదని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్య తెలిపారు. ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌ విభాగాలు రెండు సమన్వయంతో పనిచేసి వారంరోజుల్లోగా కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల సిబ్బందికి ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. సమావేశంలో ఈఈప్రసాద్‌, గణాంక అధికారి రోజా, నర్సింగరాజుపాల్గొన్నారు. అలాగే విజయనగరంలోని పార్కులు, చెరువులను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్‌ నల్లనయ్య కోరారు. నగరంలోని అయ్యవారి కోనేరును పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనేరుచుట్టూ ఉన్న వాకింగ్‌ ట్రాక్‌ను శుభ్రం చేసి వాకర్స్‌కు అనువుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Nov 13 , 2025 | 12:01 AM