Share News

ఎండీయూ వ్యవస్థ రద్దు తగదు

ABN , Publish Date - May 27 , 2025 | 12:07 AM

ఎండీయూ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా 20 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్‌ కుమార్‌ కోరారు.

ఎండీయూ వ్యవస్థ రద్దు తగదు

పార్వతీపురం/టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎండీయూ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా 20 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవకు వినతిపత్రం అందించారు. అనంతరం ఎండీయూ ఆపరేటర్లు కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:07 AM