Share News

Aadikarma Yogi గిరిజన ప్రాంతాల్లో ఆదికర్మ యోగి

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:05 AM

Aadikarma Yogi in Tribal Areas గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 18 జిల్లాలను ఎంపిక చేశారు. తొలివిడతగా నాలుగు జిల్లాల్లో దీనిని అమలు చేయనుండగా.. ఈ జాబితాలో పార్వతీపురం మన్యం జిల్లా ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Aadikarma Yogi   గిరిజన ప్రాంతాల్లో ఆదికర్మ యోగి

  • తొలివిడతలో జిల్లాకు చోటు

  • ఏజెన్సీ అభివృద్ధికి తోడ్పాటు

పార్వతీపురం, జూలై7(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 18 జిల్లాలను ఎంపిక చేశారు. తొలివిడతగా నాలుగు జిల్లాల్లో దీనిని అమలు చేయనుండగా.. ఈ జాబితాలో పార్వతీపురం మన్యం జిల్లా ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ధార్తి ఆభా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ (డీఏజేజీయూఏ)కు ఆది కర్మయోగి కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాలన , సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన ఏడుగురు మాస్టర్‌ ట్రైనీలను ఎంపిక చేశారు. బెంగళూరులో జరిగే శిక్షణ కార్యక్రమానికి వారంతా వెళ్లనున్నారు. జిల్లా నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న పీవీఎస్‌ నాయడు , పార్వతీపురం ఐటీడీఏఏ ఏపీవో మురళీధర్‌ మాస్టర్‌ ట్రైనీలుగా ఎంపికయ్యారు. వారు ఈనెల 10న బెంగళూరులో జరిగే శిక్షణ కార్యక్రమానికి వెళ్లనున్నారు. ఆదికర్మ యోగి కార్యక్రమానికి మొదటి విడతలో జిల్లా ఎంపిక కావడం, తాను మాస్టార్‌ ట్రైనీగా శిక్షణకు హాజరుకానుండడం ఆనందంగా ఉందని ఏపీవో మురళీధర్‌ తెలిపారు. ఈ నెల 16 వరకు శిక్షణ ఉంటుందని వెల్లడించారు.

Updated Date - Jul 08 , 2025 | 12:05 AM