కోనేరులో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:09 AM
మండలం లోని దిబ్బగుడ్డి వలసలో భవానీ మాలధారణలో ఉన్న ఓ యువకుడు చెరువులో సాన్నానికి వెళ్లి జారిపడి మృతిచెందాడు.
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలం లోని దిబ్బగుడ్డి వలసలో భవానీ మాలధారణలో ఉన్న ఓ యువకుడు చెరువులో సాన్నానికి వెళ్లి జారిపడి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మడి అచ్యుతరావు కుమారుడు మడి సాయి సతీష్ (24) భవానీ మాల ధరించాడు. శనివారం అదే గ్రామం లో ఉన్న ఎర్రకోనేరులో స్నానా నికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో రక్షించాలని కేకలు వేయగా, దగ్గరలో ఉన్న వారు కోనేరు నుంచి బయటకి తీశారు. కొనఊపిరితో ఉన్న సతీష్‌ను ఆటోలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న వైద్యుడు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. సతీష్ తండ్రి బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఐ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ కొండలరావు కేసు నమోదు చేశారు. శవ పంచనామా చేసి, కేసును దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు. సతీష్ డిప్లోమా చదివాడు.