Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:54 PM

మండలంలోని రాజాపులోవ వై జంక్షన్‌ సమీప జాతీయ రహదారిపై గురువా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడడ్ల రాంబాబు(27) అనే యువకుడు అక్కడకక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

భోగాపురం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజాపులోవ వై జంక్షన్‌ సమీప జాతీయ రహదారిపై గురువా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడడ్ల రాంబాబు(27) అనే యువకుడు అక్కడకక్కడే మృతిచెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం, అట్టలి గ్రామానికి చెందిన మూడడ్ల రాంబా బు విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం సమీప పరిశ్రమలో కెమిస్టీగా విధులు నిర్వహిస్తూ సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి డెంకాడ మండ లం మోదవలస సమీపంలో తన స్నేహితుడి ఫంక్షన్‌కి రాంబాబు ద్విచక్రవాహ నంపై వెళ్లాడు. ఫంక్షన్‌ అనంతరం మోదవలస నుంచి తగరపువలస వైపు తిరిగి వస్తుండగా రాజాపులోవ సమీపం వైజంక్షన్‌ వద్దకి వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలింంచారు. మృతుడి తండ్రి దాలినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాదరా వు కేసు నమోదు చేయగా.. ఎస్‌ఐ పాపారావు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి తల్లిదండ్రులు సూర్యకుమారి, దాలినాయుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు అకాలంగా మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:54 PM