రైలు ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:57 PM
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతిచెందాడు.
ఎస్.కోట రూరల్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఎస్.కోట పట్టణంలో స్థానిక రైల్వేస్టేషన్ నుంచి నడబంద గ్రామం వెళ్లే మార్గంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పోతనపల్లి గ్రామానికి చెందిన పూడి గణేష్(30) విశాఖపట్నంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం రాత్రి విధులు ముగించుకుని ఎస్.కోటకు వచ్చేసరికి ఆలస్యం అయింయి. దీంతో ఆయన ఎస్.కోటలో ఉన్న తన ఇంట్లో రాత్రి పడుకున్నాడు. వేకువజాము సమయంలో బహిర్భూమికని రైలు పట్టాలు దాటి వెళ్తుండగా.. ఈ సమయంలో రైలు ఇంజన్ వచ్చి ఢీకొంది. దీంతో గణేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు.