రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:26 AM
ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిలోని మామిడిలోవ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సీఐ చింతావాసునాయుడు మంగళవారం తెలిపారు.
ఆనందపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిలోని మామిడిలోవ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సీఐ చింతావాసునాయుడు మంగళవారం తెలిపారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణంరాయుడుపేటకు చెందిన పాలిక లక్ష్మణ్ (28), భార్య పాలిక నూకరత్నం (22) పెందుర్తి సమీపంలోని కరకవానిపాలెంలో నివాసముంటున్నారు. వీరిద్దరూ ఆనందపురం జంక్షన్‌లోని పువ్వులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరారు. పెందుర్తి నుంచి ఆనందపురం జంక్షన్‌కు సర్వీసు రోడ్డులో వస్తుండగా.. మామిడిలోవ సమీపంలో ఉన్న కోకోకోలా కంపెనీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా అతివేగంగా వస్తున్న వ్యాన్ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న పాలిక నూకరత్నంకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త లక్ష్మణ్‌కు బలమైన గాయాలయ్యాయి. సంఘటనా స్థలంకు చేరుకున్న పోలీసులు నూకరత్నం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మణ్‌ను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.