Share News

కార్మిక హక్కుల కోసం ఐక్క పోరాటం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:20 PM

కార్మిక హక్కుల కోసం ఐక్యతంగా పోరాడు తామని ఏపీ మునిపిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు.

కార్మిక హక్కుల కోసం ఐక్క పోరాటం
సాలూరు: పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఈయూ నాయకులు

.

సాలూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి):కార్మిక హక్కుల కోసం ఐక్యతంగా పోరాడు తామని ఏపీ మునిపిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు. ఆదివారం సాలూరులో ఏపీ మునిపిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. తొలుత రాజేశ్వరరావు పార్కు నుంచి డీలక్స్‌ సెంటర్‌ చిన్నబజారు, బోసుబొమ్మ మీదుగా డబ్బివీధి, వెంకటే శ్వర కళ్యాణమంపడం వరకు ర్యాలీ నిర్వహించారు. కామ్రేడ్‌ ఎన్‌.శంకరరావు, టి.శంకరరావు, సంజీవి అధ్యక్షతన జరిగిన మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్‌ డి.రమణరావు, వై.మన్మథరావు పాల్గొన్నారు.

28న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

పాలకొండ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నా పాలకులు స్పందించడంలేదని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి ఆరోపించారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో రైతు సం ఘం కార్యకర్తలసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడు తూ యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యపై ఈనెల 28న పార్వతీ పురం కలెక్టర్‌ కార్యాల యం వద్ద నిర్వహించే ధర్నాను రైతులు జయ ప్రదం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు నాయకులు బంటు దాసు,సింహాద్రి, ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:20 PM