గిరిజన సంస్కృతికి నిలువుటద్దం
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:58 PM
గిరిజన సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు పండుగ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కందికొత్తలు పండుగ
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు పండుగ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో ఆదివారం నిర్వహించిన కంది కొత్తలు పండుగలో కలెక్టర్ పాల్గొని గిరిజనుల్లో ఉత్సాహాన్ని నింపారు. గిరిజన మహిళలు, పురుషులతో కలసి థింసా నృత్యం చేశారు. సంప్రదాయం, ప్రకృతి, సంస్కృతి, దైవం కలగలిసిన ఈ వేడుక గిరిజన జీవన విధానానికి నిదర్శనమని కలెక్టర్ అన్నారు. సంక్రాంతికి ముందు కంది కొత్త పండుగ నిర్వహిస్తామని, తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని గిరిజన పెద్దలు తెలిపారు. గిరిజన సంస్కృతిలో దాగి ఉన్న విలువలను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా ఈ పండుగను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్ తమ మధ్యకు వచ్చి సామన్యుడిలా వేడుకల్లో భాగస్వామ్యం కావడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.