Share News

తిరుమలలో విజయనగరం జిల్లావాసి అదృశ్యం

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:06 AM

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన విజయనగరం జిల్లావాసి కనిపించడం లేదంటూ శనివారం తిరుమల టూటౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.

తిరుమలలో విజయనగరం జిల్లావాసి అదృశ్యం

తిరుమల, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన విజయనగరం జిల్లావాసి కనిపించడం లేదంటూ శనివారం తిరుమల టూటౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. విజయనగరం జిల్లా, కన్వితిమ్మాపురానికి చెంది న సురేష్‌(37) గత నెల 19వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చాడు. అదేరోజు తిరుమలలోని యాత్రిసదన్‌ వద్ద కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతని కోసం తిరుమల, తిరుపతి, సొంత ఊర్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం తిరుమల టూటౌ న్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్‌ వివరాలు తెలిసిన వారు 9440796772 కు తెలియజేయాలని కోరారు.

Updated Date - Aug 10 , 2025 | 12:06 AM