Share News

రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతి

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:06 AM

మండలంలోని డముకు వ్యూపాయింట్‌ వద్ద యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతి

అనంతగిరి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డముకు వ్యూపాయింట్‌ వద్ద యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలివి.. విజయనగరం జిల్లా ఎస్‌. కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కిశోర్‌ అనే వ్యక్తి స్కూటీపై అరకువెళ్లి, ఆదివారం తిరుగు ప్రయాణంలో డముకు వ్యూ పాయింట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి లోనై సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలువివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందాల్సి ఉంది.

Updated Date - Sep 22 , 2025 | 12:06 AM