సంకిలిలో గాడితప్పుతున్న పాలన
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:42 PM
మండలంలో గ్రేడ్-1 పంచా యతీగా ఉన్న సంకిలిలో పాలన గాడితప్పుతోంది. ఏడాదిగా రెగ్యులర్ కార్యదర్శి పోస్టు భర్తీకి నోచుకోకపోవడంతో ప్రజలకు అగచాట్లు తప్ప డంలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆ ప్రభావం పడుతోందని పలువురు వాపోతున్నారు.
రేగిడి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రేడ్-1 పంచా యతీగా ఉన్న సంకిలిలో పాలన గాడితప్పుతోంది. ఏడాదిగా రెగ్యులర్ కార్యదర్శి పోస్టు భర్తీకి నోచుకోకపోవడంతో ప్రజలకు అగచాట్లు తప్ప డంలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆ ప్రభావం పడుతోందని పలువురు వాపోతున్నారు.
సంకిలి పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడంతో పాలనపర మైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఏడాదిగా ఇన్‌చార్జి కార్యదర్శి విధు లు నిర్వహిస్తున్నారు. ఇక్కడి సచివాలయం పరిఽధిలో సంకిలి, అప్పా పురం పంచాయతీల్లో నాలుగు వేలుజనాభా నివస్తున్నారు. అప్పాపురం లో గ్రేడ్-5 కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు. సంకిలికి గ్రేడ్-1 కా ర్యదర్శి కుర్మారావు గార మండలం డిప్యుటేషన్‌పై వెళ్లిపోయిన తర్వాత ఆ పోస్టు భర్తీకి నోచుకోలేదు.ప్రస్తుతం ఆయన పదోన్నతిపై వేరేచోట డిప్యుటీ ఎంపీడీవోగా నియమితులయ్యారు. దీంతో ఏడాదిన్నరగా ఇక్కడ గ్రేడ్-1 పోస్టు ఇన్‌చార్జిలతో నడుస్తోంది. ఇప్పటికే ముగ్గురు కార్యదర్శులు మారారు.అయితే ప్రస్తుతం ఇద్దరు కార్యదర్శులు ఈపంచాయతీ బాధ్య తలుచూస్తున్నారు. డీడీవోగా దేవుదళకార్యదర్శికి, సచివాలయ బాధ్య తలు అడవరంపంచాయతీగ్రేడ్-5 కార్యదర్శికి అప్పగించినట్లు ఎంపీడీవో శ్యామలాకుమారి తెలిపారు. అయితే వీరంతా ఇన్‌చార్జిలు కావడంతో సంకిలి ఎప్పుడు వస్తారో,ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని స్థానికు లు వాపోతున్నారు. దీంతో సచివాలయం నిర్వహణ గాడితప్పుతోందని పలువురు వాపోతున్నారు. మండలంలో అతిపెద్ద పంచాయతీగా ఉన్న సంకిలి సచివాలయానికి రెగ్యులర్‌కార్యదర్శి లేకపోవడంతో పాలన పర మైన సమస్యలు తలెత్తుతున్నాయి.పంచాయతీకి బిల్లుల చెల్లింపు, హౌస్ టాక్స్ వసూళ్లు, ఇతర సర్వేలు, ఎస్‌డబ్ల్యూపీసీ తదితర పాలనా వ్యవహా రాల్లో వెనుకబడిపోతోంది. పూర్తిస్తాయి కార్యదర్శి లేకపోవడం వల్ల ఈ ఏడాది పన్ను వసూళ్లు రూ.12లక్షలు లక్ష్యంకాగా, ఇప్పటికి రూ.50వేలు వసూళ్లు కూడా కాలేదని సర్పంచ్ పట్టాబి తెలిపారు. రెగ్యులర్ కార్యదర్శి పోస్టు భర్తీకి ఇప్పటికే మండల, జిల్లాస్థాయి అధికారులకు నివేధించి నట్లు చెప్పారు. కాగా పంచాయతీలో జనాభా దృష్ట్యా గ్రేడ్- 1 కార్యదర్శి లేకపోవడం ఇబ్బందిగా ఉందని ఎంపీడీవో శ్యామలాకుమారి తెలిపారు. ఈవిషయం జిల్లాయంత్రాంగానికి నివేదించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కార్యదర్శులకు ఇన్‌చారి బాధ్యతలు అప్పగించామని, వీరితో ఇంటిపన్ను వసూళ్లు, పాలనావ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.