రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:27 AM
మండలంలోని పల్లిగండ్రేడు తెట్టంగి గ్రా మాల పొలాల మధ్య రోడ్డు ప్రమాదంలో పెనుబర్తి గ్రామానికి చెందిన అచ్యుత రావు(45) మృతిచెందాడు.
గుర్ల, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని పల్లిగండ్రేడు తెట్టంగి గ్రా మాల పొలాల మధ్య రోడ్డు ప్రమాదంలో పెనుబర్తి గ్రామానికి చెందిన అచ్యుత రావు(45) మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం దేవునికనిపాక గ్రామం నుంచి బైక్‌పై అచ్యుతరావుతోపాటు మరో ఇద్దరు తన స్వగ్రామం పెనుబర్తి వెళ్తుండగా.. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకు నడుపు తున్న అచ్యుతరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు గుసిడి నారాయణరావు, తాడేల కృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనం పై విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అచ్యుతరావు మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి భార్య పోలప్ప, ఇద్దరు పిల్లలు తరుణ్, వసంత్‌లు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.