Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:47 PM

మండలంలోని కోనాడ జంక్షన్‌ సమీపంలో సర్వీస్‌ రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డోల దామోదరరావు(27) అనే వ్యక్తి మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పూసపాటిరేగ, జూలై 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనాడ జంక్షన్‌ సమీపంలో సర్వీస్‌ రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డోల దామోదరరావు(27) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దామోదరరావు మరొక ఇద్దరు వారి స్వగ్రామమైన డెంకాడ మండలం దొడ్డిబాడువ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. స్థానిక టీవీఎస్‌ షోరూం సమీపంలోకి వచ్చేసరికి డివైడర్‌కు బలంగా ఢీకొన్నారు. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న దామోదరావు కిందపడి అక్కడిక్కడే మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:47 PM